పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తగ్గింది. మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గటానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను.

30. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన 50 విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించటం కోసం, ఎంపిక కాబడిన ప్రతీ పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం క్రింద 1 కోటి 25 లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది. ఇప్పటి వరకు షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 1,858 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

31. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్షా 95 వేల కంటే ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు స్వల్పకాలిక ఇంటర్న్ షిప్ ను పూర్తి చేయగా, వీరిలో చాలా మంది మైక్రోసాఫ్ట్, సేల్స్ ఫోర్స్, AWS, పాలో ఆల్టో, బ్లూ ప్రిజం మొదలగు బహుళ జాతి కంపెనీలలో ప్రస్తుతం పని చేస్తున్నారు.

32. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో వైద్య మరియు దంత వైద్య కోర్సులలో 50 శాతం కోటాను, మిగతా అన్ని కోర్సులలో 35 శాతం కోటాను ప్రభుత్వ కోటాగా మా ప్రభుత్వం కేటాయించింది. దీని ఫలితంగా, 2,118 మంది విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో చేరగలుగుతున్నారు.

ఆరోగ్య సంరక్షణ

పురాతన రోమన్ సామెత ప్రకారం...

"సాలస్ పాపులి సుప్రీమ లెక్స్ ఎస్టో" అంటే,
"ప్రజల ఆరోగ్యమే అత్యున్నత చట్టం"

33. రాష్ట్ర ప్రజలందరికి ఆరోగ్య సంరక్షణా సేవలను సమర్ధవంతంగా అందించటంలో ప్రజారోగ్య మౌలిక సదుపాయాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఆరోగ్య రంగంలో నాడు-నేడు పథకాన్ని అమలు చేయటం ద్వారా మా ప్రభుత్వం ఉప ఆరోగ్య కేంద్రాల నుండి మొదలుకుని

9