పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

27. 43 లక్షల కంటే ఎక్కువ మంది విద్యార్థులకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పునరుద్ధరించబడింది. ఈ పథకం క్రింద ఏడాదికి 1,910 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇది గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ. పోషకాహార లోపం మరియు రక్తహీనతను పరిష్కరించేందుకు 77 గిరిజన మండలాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ ప్లస్ పథకాన్ని, ఇతర ప్రాంతాలలో వై.ఎస్.ఆర్. సంపూర్ణ పోషణ పథకాన్ని, అమలు చేసాము. ఈ పథకం ద్వారా 35 లక్షల 71 వేల మంది మహిళలు మరియు పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు. 15 నుండి 49 సంవత్సరాల మధ్య వయసులో ఉండి రక్త హీనతతో బాధపడుతున్న గర్భిణుల శాతం 2019 నాటికి 53.71 శాతం కాగా, 2023 నాటికి అది 24.66 శాతానికి తగ్గింది. అలాగే, ఎదుగుదల లోపాన్ని ఎదుర్కొంటున్న పిల్లల శాతం 2019 నాటికి 31.2 శాతం కాగా, 2023 నాటికి అది 6.84 శాతానికి తగ్గింది.

ఉన్నత విద్య

ప్రముఖ ఆర్థిక వేత్త శ్రీ అమర్త్య సేన్ మాటలలో...

"విద్య మనల్ని మనుషులుగా చేస్తుంది. మన ఆర్థిక అభివృద్ధిని, సామాజిక సమానత్వాన్ని,
లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మన జీవితాలను అన్ని రకాలుగా మార్చే సామర్థ్యం
విద్య మరియు భద్రతలకు వున్నాయి”

28. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యపై చేసే ఎలాంటి ఖర్చునైనా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగానే పరిగణిస్తారు. అర్హులైన విద్యార్థులందరికీ ఉచితంగా ఉన్నత విద్యను అందించే పూర్తి బాధ్యతను వహిస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమే.

29. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయటం వలన, ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది. ఉన్నత విద్యలో డ్రాప్ అవుట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37 శాతం కాగా, 2022-23 సంవత్సరంలో 6.62 శాతం కి గణనీయంగా

8