పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాగు నీరు అందించటంతో పాటు, ఆ చుట్టు ప్రక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరిగి త్రాగునీటి స్థిరీకరణ జరిగింది. దీని ఫలితంగా స్థానిక కరువు పీడిత ప్రాంతాలలో కేవలం వర్షాలపైనే ఆధారపడిన రైతులకు ఎంతో మేలు జరిగింది.

108. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ మరియు నెల్లూరు బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ 6, 2022న ప్రారంభించారు. వీటివలన కావలి కాలువ మరియు కనుపూరు కాలువ క్రింద 2.85 లక్షల ఎకరాలు, మరియు పెన్నార్ డెల్టా వ్యవస్థ క్రింద 99,525 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది.

109. ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాలలోని 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ అమలు చేయబడుతోంది.

110. హెచ్.ఎన్.ఎస్.ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెలలో ప్రారంభోత్సం చేయాలి అని మా అలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీనివలన నీరు లభ్యమవుతుంది. పోషించనుంది.

111. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థసాగర్, వంశధార నాగావళి లింక్, హీరమండలం రిజర్వాయర్, గొట్టా ఎల్.ఐ.ఎస్, తోటపల్లి రిజర్వాయర్, మహేంద్ర తనయ ఆఫ్షోర్ రిజర్వాయర్, తాండవ ఎల్.ఐ.ఎస్., రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి.

త్రాగు నీరు

112. తొమ్మిది జిల్లాలలో త్రాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 త్రాగునీటి పథకాలు మంజూరు చెయ్యబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాలలోని

29