పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం, మహిళల కోసం న్యూ మోడల్ డిగ్రీ కళాశాలను కూడా స్థాపించింది. సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఉన్నత విద్యను అందించడానికి కర్నూల్లో క్లస్టర్ యూనివర్సిటీ స్థాపించటం జరిగింది. అంతే కాకుండా రెండవ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయుటకు మా ప్రభుత్వం మంజూరు చేసింది.

నీటి వనరులు

105. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నిర్మాణ కార్యకలాపాలను వేగవంతం చేయటం తో పాటు ప్రాజెక్ట్ యొక్క సవరించిన వ్యయ అంచనాలను కేంద్ర ప్రభత్వం ఆమోదించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ పనులన్నీ చాలా చురుకుగా సాగుతున్నాయి. మే 2019లో 42 శాతంగా ఉన్న హెడ్ వర్క్స్ పురోగతి ఇప్పుడు 70 శాతంగా ఉంది. గోదావరి నది చరిత్రలో తొలిసారిగా రేడియల్ గేట్లను సక్రమంగా ఏర్పాటు చేసి స్పిల్వే ద్వారా వరద నీటిని మళ్లించటం జరిగింది.

106. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నవంబర్ 30, 2023న, రెండవ అవుకు టన్నెల్ ప్రారంభించబడింది. దీని ద్వారా అదనంగా 10,000 క్యూసెక్కుల నీటిని గండికోట రిజర్వాయర్ కు తీసుకు వెళతారు. అవుకు మొదటి టన్నెల్ మరియు రెండవ టన్నెల్లు పూర్తి చేయటం జరిగింది. అయితే మూడవ టన్నెల్ నిర్మాణం పూర్తి కానుంది. 1,079 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబడుతున్న ఈ టన్నెల్ ద్వారా కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాలలోని 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల పరిధిలోని 20 లక్షల మందికి త్రాగునీరు అందుతుంది.

107. గౌరవ ముఖ్యమంత్రి గారు 77 చెరువుల అనుసంధాన ప్రాజెక్టును సెప్టెంబర్ 19, 2023న ప్రారంభించారు. అప్పటి నుంచి పత్తికొండ, డోన్, ఆలూరు మరియు పాణ్యం నియోజకవర్గాలలో 1.24 టీ.ఎం.సీ.ల నీటిని ఎత్తిపోయడం ద్వారా సుమారు 10 వేల ఎకరాల

28