పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ - ప్రతి గ్రామం అనుసంధానం

101. నవంబర్ 2023 సంవత్సరంలో 'భారత్ నెట్' రెండవ దశ ప్రాజెక్ట్ అమలును మా ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. 613 మండలాలలోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ మొత్తం 55,000 కి.మీ. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేయబడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయితీకి కనీసం 1 Gbps ను కల్పించాలనే లక్ష్యంతో ఉండగా, మా ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయితీకి 30 Gbps ను అందిస్తోంది. అన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించబడ్డాయి.

నూతన వైద్య సంస్థలు

102. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి, రాష్ట్రంలో కేవలం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే స్థాపించబడగా, మా ప్రభుత్వం 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేసింది. వీటితో పాటు ఇప్పటివరకు 10 కొత్త వైద్య కళాశాలు, 10 బోధనా ఆసుపత్రులు, 4 ఇతర ఆసుపత్రులు మరియు 3 నర్సింగ్ కళాశాలలు స్థాపించబడ్డాయి. పలాసలో మూత్ర పిండాల వ్యాధుల పరిశోధనా కేంద్రాలు, తిరుపతిలో చిన్నపిల్లల గుండె జబ్బుల నివారణా కేంద్రం వంటి విభిన్న ప్రత్యేకతలు కలిగిన మూడు అత్యున్నత ఆసుపత్రులు మరియు 6 క్యాన్సర్ సెంటర్లు స్థాపించబడ్డాయి.

103. గిరిజనులు అధికంగా ఉండే సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం మరియు డోర్నాలలలో ఆరోగ్య సేవలను పొందడంలో వున్న అంతరాన్ని తగ్గించడానికి బహుళ సదుపాయాలు గల ఆసుపత్రులను స్థాపించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపటం జరిగింది.

నూతన విజ్ఞాన కేంద్రాలు

104. మా ప్రభుత్వం కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాల, విజయనగరంలో సెంట్రల్ గిరిజనుల విశ్వవిద్యాలయం, గురజాడ, విజయనగరంలో జవహర్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, ఒంగోలులో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం, వై.ఎస్.ఆర్ కడపలో డా॥

27