పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79. వై.ఎస్.ఆర్. నేతన్న నేస్తం పథకం క్రింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాము.

80. జగనన్న తోడు పథకం క్రింద 16 లక్షల 73 వేల మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతివృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయటం జరిగింది.

81. జగనన్న చేదోడు పథకం క్రింద రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ పని వార్లకు చెందిన 3లక్షల 40 వేల మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది.

82. వై.ఎస్.ఆర్. వాహన మిత్ర పథకం క్రింద 2 లక్షల 78 వేల మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాము.

83. వై.ఎస్.ఆర్. లా నేస్తం క్రింద 6,069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5 వేల రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాము.

84. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (NREGA) క్రింద 2023 సంవత్సరము డిసెంబర్ నెల చివర వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజులలో చెల్లింపులు చేయబడ్డాయి.

85. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నారు.

సామాజిక సంక్షేమం

86. షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధికి నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు, మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇందుకు నిదర్శనంగా JEE మరియు NEET వంటి పోటీ పరీక్షలలో మన

22