పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవత్సరములో స్థిర ధరల సూచి ప్రకారం మన రాష్ట్ర తలసరి ఆదాయం 1,54,031 రూపాయలతో దేశంలో 18వ స్థానములో ఉండగా, నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 2,19,518 రూపాయలతో 9వ ర్యాంకు సాధించింది.

వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక

71. మా ప్రభుత్వము వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక పథకం లబ్దిదారుల అర్హత వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించి సంతృప్త స్థాయిలో అమలు చేస్తుంది. ఈ పధకము క్రింద పెన్షన్ మొత్తంను జనవరి 1, 2024 నుండి నెలకు 3 వేల రూపాయలకు మరియు ఆరోగ్య పింఛన్లను నెలకు 10 వేల రూపాయలకు పెంచబడ్డాయి. 2019 సంవత్సరములో ఈ పింఛన్ల పంపిణీ మొత్తము నెలకు 1,385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరము జనవరి నెల నాటికి 1,968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరము నుండి మా ప్రభుత్వం 66 లక్షల 35 వేల మంది లబ్ధిదారులకు వై.ఎస్.ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది.

ప్రజా పంపిణీ వ్యవస్థ

72. మా ప్రభుత్వము ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశ్యముతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యజమానులైన షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల, బలహీన వర్గాల, మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది.

73. మా ప్రభుత్వము 2019-2023 సంవత్సరాల మధ్య కాలములో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా, 2014-2019 సంవత్సరాల మధ్య కాలములో బియ్యం సబ్సిడీ క్రింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే.

20