పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67. మా ప్రభుత్వము 32 వేల 909 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలలో త్రాగునీటి సరఫరా, విద్యుత్, రోడ్లు మొదలైన మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తుంది. వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీల్లో ఇప్పటి వరకు 1,62,538 మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.

సంక్షేమం

ప్రత్యక్ష నగదు బదిలీ (డి.బి.టి)

68. ఎలాంటి వివక్ష లేకుండా అన్ని సంక్షేమ పథకాల అర్హులందరికీ అందాలనే ప్రభుత్వ నినాదానికి అనుగుణంగా, ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రయోజనాలు అందేలా చూడాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకము విధానంలో అమలు చేస్తోంది. కులం, మతం మరియు ఇతర అంశాలతో సంబంధం లేకుండా ప్రయోజనాలు అందరికీ చేరేలా చేస్తుంది. ప్రత్యక్ష నగదు బదిలీ పథకము మరియు సంక్షేమ కార్యక్రమాల వలన కోవిడ్- 19 మహమ్మారి సమయంలో కలిగిన ఆర్థిక ఇబ్బందుల నుండి ప్రజలకు భరోసానిచ్చి రక్షణను కల్పించాము. ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు నిస్వార్థంగా, అవిశ్రాంతంగా పనిచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి, వాలంటీర్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

69. పైన చెప్పిన అంశాలకు సంబంధించి 2019-20 ఆర్థిక సంవత్సరము నుండి 2023- 24 ఆర్ధిక సంవత్సరము వరకు మా ప్రభుత్వము, ప్రత్యక్ష నగదు బదిలీ పధకము ద్వారా 2 లక్షల 53 వేల కోట్ల రూపాయలను, ఇతర పథకముల ద్వారా ఒక లక్ష 68 వేల కోట్ల రూపాయలను బదిలీ చేశాము. ఈ విధంగా గత ఐదేళ్లలో 4 లక్షల 21 వేల కోట్ల రూపాయలను ప్రజలకు బదిలీ చేశాము.

70. విజయవంతమైన, సమగ్రమైన ఈ ప్రత్యక్ష మరియు ఇతర పథకాల అమలు కారణంగా, లక్షలాది కుటుంబాలను పేదరికం నుండి తప్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి కొత్త అవకాశాలను కల్పిస్తూ వారి అభివృద్ధి మరియు అభ్యున్నతికి తొడ్పడుతుంది. 2019

19