పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఉచిత పంటల బీమా క్రింద, మా ప్రభుత్వం 54 లక్షల 55 వేల మంది రైతుల ఖాతాలకు 7,802 కోట్ల రూపాయల బీమా మొత్తాన్ని అందించగా, గత ప్రభుత్వం కేవలం 30 లక్షల 85 వేల మంది రైతులకు 3,411 కోట్ల రూపాయలను మాత్రమే అందించింది.

53. మా ప్రభుత్వము డాక్టర్ వై.ఎస్.ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద, 2019 సంవత్సరము ఖరీఫ్ కాలము నుండి, గత ప్రభుత్వ బకాయిలతో సహా 73 లక్షల 88 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు 1,835 కోట్ల రూపాయలను జమ చేసింది.

54. రైతులకు వారి ఇంటి వద్దకే సేవలను అందించడానికి 10,778 డా॥ వై.ఎస్.ఆర్. రైతు భరోసా కేంద్రాలు వన్ స్టాప్ సెంటర్లుగా స్థాపించబడ్డాయి. ఇవి ఆదర్శవంతముగా పని చేస్తూ ఇతరులు కూడా అనుసరించడానికి మార్గదర్శకముగా ఉన్నాయని నీతి ఆయోగ్ చే ప్రశంసించబడ్డాయి.

55. మా ప్రభుత్వము 19 లక్షలకు పైగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కోతలు లేని రోజువారీ 9 గంటల నిరంతర ఉచిత విద్యుత్ సదుపాయము కల్పించింది. 2019 సంవత్సరము నుండి ఇప్పటివరకు ఉచిత వ్యవసాయ విద్యుత్ పై 37,374 కోట్ల రూపాయల సబ్సిడీని అందించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు విక్రయించే రైతుల కోసము 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాము. మా ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ క్రింద పంట నష్టపోయిన 22 లక్షల 85 వేల మంది రైతులకు తక్షణ సాయంగా 1,977 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు అందించింది. మరో 1200 కోట్ల రూపాయలను ఈ నెలలో అందించబోతున్నాము.

56. మా ప్రభుత్వము,127 కొత్త డాక్టర్ వై.ఎస్.ఆర్. వ్యవసాయ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి ద్వారా పంటకోత అనంతర మౌలిక సదుపాయాలను కల్పించారు. వై.ఎస్.ఆర్. యంత్ర సేవా పథకం క్రింద వ్యవసాయ యంత్రాలను అందజేయటమే కాకుండా రైతులు మరియు గ్రామ యువతకు డ్రోన్ పైలట్ శిక్షణను అందించారు.

15