పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అందించాము. ఈ పథకం వలన 1 వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగింది. దీని ఫలితంగా, ప్రాథమిక విద్యలో బడిలో చేరు విద్యార్ధుల నికర నమోదు నిష్పత్తి 2019 సంవత్సరములో 87.80 శాతము ఉండగా, 2023 వ సంవత్సరము నాటికి 98.73 శాతమునకు పెరిగింది. ఉన్నత మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 2019 సంవత్సరములో 46.88 శాతము ఉండగా 2023 సంవత్సరము నాటికి 79.69 కి పెరిగింది.

45. రాష్ట్రంలోని స్వయం సహాయక బృందాలకు సరైన మద్దతు ఇవ్వడంలో గత ప్రభుత్వం వైఫల్యం చెందడం వలన వీరు అప్పుల ఊబిలో కూరుకొని ఆర్థిక పతనావస్థకు చేరుకున్నారు. మా ప్రభుత్వం మానిఫెస్టోలోని వాగ్దానానికి కట్టుబడి ఏప్రిల్ 11, 2019 సంవత్సరము నాటికి ఉన్న స్వయం సహాయక బృందాల యొక్క బకాయిలను తిరిగి చెల్లించడానికి వై.ఎస్.ఆర్ ఆసరా పథకాన్ని అమలు చేసింది. 2019 సంవత్సరము నుండి, 7 లక్షల 98 వేల స్వయం సహాయక సంఘాలలోని 78 లక్షల 94 వేల మంది మహిళా మహారాణులకు ఉపశమనం కల్పిస్తూ వై.ఎస్.ఆర్. ఆసరా క్రింద 25,571 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించడం జరిగింది.

46. మా ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకము క్రింద గత ప్రభుత్వ హయాంలో మనుగడ కోల్పోయిన స్వయం సహాయక బృందాలను క్రియా శీలం చేయటానికి మహిళా మహారాణులకు 4,969 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. ఫలితంగా, 18.36 శాతముగా ఉన్న మొండి బకాయిలు గణనీయముగా తగ్గి దేశంలోనే అతి తక్కువ స్థాయి అయిన 0.17 శాతానికి చేరాయి.

47. వై.ఎస్.ఆర్. చేయూత పథకం ద్వారా 26 లక్షల మంది మహిళా మహారాణులకు ఆర్థిక కార్యకలాపాలు చేపట్టేందుకు మరియు వారి జీవనోపాధికి భద్రత కల్పించటానికి 14,129 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది.

48. జగనన్న పాల వెల్లువ పథకం క్రింద, 3 లక్షల 60 వేల మంది మహిళా మహారాణులకు డెయిరీ ద్వారా అధిక ఆదాయాన్ని పొందేందుకు వీలుగా 2,697 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది.

13