పుట:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్(VOA) ప్రసంగం 2024-25.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41. విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి 201 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలలో వర్చువల్ ల్యాబ్ లు మరియు క్లాస్ రూమ్ లు ఏర్పాటు చేయడంతో పాటు, 14 పారిశ్రామిక శిక్షణా కేంద్రాలలో కియా మోటార్స్, మారుతీ, టయోటా, ఇసుజు, హిటాచీ, సామ్సంగ్ మొదలైన సంస్థల సహాయంతో అధునాతన యంత్రాలు మరియు యంత్ర పరికరాలతో ల్యాబ్ లను ఏర్పాటు చేస్తున్నాము.

III. మన మహిళా మహారాణుల ఆంధ్ర

మహిళా సాధికారత - నారీ శక్తి


డా॥ బి.ఆర్. అంబేద్కర్ గారి మాటలలో...

“ఒక సమాజం యొక్క పురోగతిని,
ఆ సమాజం యొక్క మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను కొలుస్తాను”

42. జనాభాలో సగం మంది సంక్షేమం మరియు సాధికారితకు నోచుకోకపోతే ఏ రాష్ట్రమైనా పురోగతి సాధించలేదు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టిసారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వాములుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. దీనిద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు.

43. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించేందుకు, 2021-22 ఆర్థిక సంవత్సరము నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ లను ప్రవేశపెట్టడం జరిగింది.

44. సమాజములో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో, జగనన్న అమ్మ ఒడి పథకమును ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాము. దీని క్రింద 43 లక్షల 61 వేల మంది మహిళా మహారాణులకు 26,067 కోట్ల రూపాయలు

12