పుట:ఆంధ్రపదనిధానము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొఱఁతగఁ దోఁచుటచేతను ఆంధ్రనామసంగ్రహమునకు సాంబనిఘంటు వీవలిది. వెంకటేశాంధ్రము సాంబనిఘంటువునకు సమకాలికము. ఆంధ్రనామసంగ్రహమునకు తరువాత జనించిన ఆంధ్రనామశేషమును గూర్చి ప్రత్యేకించి చెప్పవలసినపనిలేదు. సమగ్రమగు ఆంధ్రభాషార్ణమునకుఁ టీక లేకపోయినందునను దానియునికియె యిటీవలివారలకు తెలియనందునను అసమగ్రనిఘంటువులు కొన్ని బయలు వెడల నవకాశము గలిగినది.

ఆంధ్రపదనిధానమునకు మాతృకయగు శబ్దరత్నాకరమునందు ఆంధ్రభాషార్ణవ ముట్టంకితమగుటచే నందలిపదములు సంగ్రధితము లైన వనవచ్చును. శబ్దరత్నాకరసారమగు నీయాంధ్రపదనిధాన మీకారణములచేఁ బ్రకృతోపలభ్యములు, పూర్వోక్తములు నగునిఘంటువు లన్నింటికంటె సమగ్రమనుట నిస్సంశయము, ఆంధ్రభాషార్ణవమున గ్రియావర్గ మొకటి కలదు. అందు ధాతురూపములు వివరింపఁబడినవి. సామాన్యవ్యాకరణసహాయమున రూపింపఁదగిన యీరూపములకుఁ బ్రత్యేకవివరణము అనవసరమని కాఁబోలు ఆంధ్రపదనిధానకారుఁ డావర్గమును మానినాఁడు. ఆంధ్రభాషార్ణవమున రచనాప్రాగల్భ్యసూచకముగఁ బర్యాయపదములు మిగులదీర్ఘములుగఁ జెప్పఁబడినవి. జిజ్ఞాసువుల కాదీర్ఘపదములనుండి హ్రస్వపదముల గల్పించుట యెంతేని కష్టమనుటకు సందేహములేదు. ఆంధ్రభాషార్ణవములోని శివనామములఁ జూడుడు.

సీ.

గట్టుల యెకిమీడు గన్నవాల్గంటిని
              జెట్టపట్టుక యేలినట్టి దిట్ట
మున్నీటిరాచూలి ముక్కఁగెంజెడలోనఁ
              క్రొవ్విరిగాఁ దాల్చుకొన్నమేటి
గబ్బుచెంకమెకంబు గట్టికళవసంబు
              కుబుసంబుగాఁ జేసికొన్నదంట
ప్రాఁబల్కుగుఱ్ఱముల్ పన్నిసిస్తగునట్టి
              పుడమితే రెక్కిన పోటుకాఁడు

ఈదీర్ఘపదము లాంధ్రపదనిధానమున వరుసగఁ గొండయల్లుఁడు, నెలతాల్పు, తోలుదాల్పరి యనుపర్యాయపదములుగ నీయఁబడెను. ఇట్లే సంక్షేపరూపమున నున్నకతన ఆంధ్రపదనిధానమునందు విశేషపదసముదాయము 1565 పద్యములలో నిముడుట కవకాశము చిక్కినది. వర్గీకరణమున నామ