పుట:ఆంధ్రపదనిధానము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

స్వర్గవర్గు

తోలుదాల్పరి, వాఁకతాల్పు, చిచ్చరకంటిదేవర, బేసికంటిసామి, వలదులల్లుఁడు, గంగికైయలుగువాడు, బూచులయెకిమీడు అననివి శివునకుఁ బేర్లు.

గీ.

దుగ్గి మలయమ్మ యమ్మికదుగ్గ జండి
సత్తి కఱకంఠునిల్లాలు సామితల్లి
గట్టుచూలి గట్రాచూలి గట్లఱేని
పట్టి సింగమెక్కుడుజంత పార్వతియగు.

16

దుగ్గి, మలయమ్మ, అమ్మిక, దుగ్గ, చండి, సత్తి, కఱకంఠునిల్లాలు, సామితల్లి, గట్టుచూలి, గట్రాచూలి, గట్లఱేనిపట్టి, సింగ మెక్కుడు, జంత, అననివి పార్వతీదేవిపేర్లు.

క.

దనుజారి నంది కగు బస
వన యనఁగా నాలఱేఁడు బసవఁ డనఁగఁ బే
ర్కొనె భువిని; ద్రిశూలము ము
మ్మొనవాలనఁ దెనుఁగునందు ముద మొప్పారన్.

17

బసవన, ఆలఱేఁడు, బసవఁడు, అననివి నందికిపేర్లు. ముమ్మొనవాలు ఇది త్రిశూలముపేరు.

సీ.

కందుండు వేలుపుగమికాఁడు పుంజుఁదా
         ల్పరిసామి యమ్మికపట్టి యగ్గి
చూలిముద్దయ ఱెల్లుచూలి కొమరసామి
         కొంచగుబ్బలివ్రక్కలించుమేటి
నెమ్మిరౌ తార్గురునెలఁతలబిడ్డఁడు
          నెమ్మితాల్పరియును నెమ్మిఱేఁడు