పుట:ఆంధ్రపదనిధానము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్గవర్గు

15


తిగజంటమోములదేవరయన శక్తి
           ధరునినామంబులౌ; చెఱుపుఱేఁడు


గీ.

గుజ్జువేలుపు పిళ్లారి కొక్కురౌతు
బొజ్జదేవర యేనుఁగుమోమువేల్పు
నొంటికొమ్మయ్య వెనకయ్య జంటతలుల
బిడ్డ కుడుములతిండినా విఘ్నరాజు.

18

కందుఁడు, వేలుపుగమికాఁడు, పుంజుదాల్పరి, సామి, అమ్మికపట్టి, అగ్గిచూలి, ముద్దయ, ఱెల్లుచూలి, కొమరసామి, క్రొంచగుబ్బలివ్రక్కలించుమేటి, నెమ్మిరౌతు, ఆర్గురినెలతలబిడ్డఁడు, నెమ్మితాల్సరి, నెమ్మిఱేఁడు, తిగజంటమోటులదేవర, అన నివి కుమారస్వామికిఁ బేళ్లు. చెఱుపుఱేఁడు, గుజ్జువేల్పు, పిళ్లారి, కొక్కురౌతు, బొజ్జదేవర, ఏనుఁగుమోమువేల్పు, ఒంటికొమ్మయ్య, వెనకయ్య, జంటతల్లులబిడ్డఁడు, కుడుములతిండి, అన నివి వినాయకునిపేళ్లు.

గీ.

మలపగతుఁడు వేఁగంటియు మబ్బురౌతు
నొడలిచూపొడయఁడు వేల్పుటొడయఁడు సుర
తాణియును తూర్పుఱేఁ డన దనుజశైల
వజ్రి వజ్రి కభిఖ్యలై వఱలె శౌరి.

19

మలపగతుఁడు, వేఁగంటి, మబ్బురౌతు, ఒడలిచూపొడయఁడు, వేల్పుటొడయఁడు, సురతాణి, తూర్పుఱేఁడు, అనగ నివి యింద్రునకుఁ బేళ్లు.

క.

మలపగతునిరాణి యనం
జెలఁగెను సురతాణి యనఁగఁ జెల్లె శచికి; వే
ల్పులబోనము సుధపేరై
విలసిల్లెను కలుషభంగ విహగతురంగా.

20