పుట:ఆంధ్రపదనిధానము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్గవర్గు

13


కాట్రేఁడు మిక్కిలికంటిదేవర యగ్గి
          కంటి పునుకతాల్పు కాటిఱేఁడు
గట్టువిల్తుఁడు వేఁడికంటి తెల్లనిసామి
          విసపుమేతరి మిత్తివేఁటకాఁడు
జింకతాల్పరి నింగిసిగ కఱకంఠుఁడు
          కొండయల్లుఁడు వెండికొండవిడిది
వేలుపు మిన్వాఁకతాలుపు వలదొర
           సూడు జన్నపుగొంగ కోడెరౌతు
జడముడిజంగంబు కుడుములతిండిదే
          వరతండ్రి ముమ్మొనవాలుదారి
తోలుఁదాల్పరి వాఁకతాలుపు చిచ్చఱ
          కంటిదేవర బేసికంటిసామి


గీ.

వలమలల్లుఁడు గంగికైయలుగువాఁడు
నాఁగ బూచులయెకిమీడునాఁగ శివుని
కాఖ్య! లబ్ధినివేశ మహాప్రకాశ
బాలనగరేశ యళికేశ భవవినాశ.

15

అయిదుమోములవేల్పు, ఆబోతురౌతు, అంగమొలవేల్పు, నెలతాల్పు, చిలువతాల్పు, తిగకంటి, ముక్కంటి, దిసమొలవేల్పు, మినుసిగదేవర, మిత్తిగొంగ, కాట్రేఁడు, మిక్కిలికంటిదేవర, అగ్గికంటి, పునుకతాల్పు, కాటిఱేఁడు, గట్టువిల్తుఁడు, వేఁడికంటి, తెల్లనిసామి, విసపుమేఁతరి, మిత్తివేఁటకాఁడు, జింకతాల్పరి, నింగిసిగ, కఱకంఠుఁడు, కొండయల్లుఁడు, వెండికొండవిడిదివేలుపు, మిన్వాఁకతాలుపు, వలదొరసూడు, జన్నపుగొంగ, కోడెరౌతు, జడముడిజంగము, కుడుములతిండిదేవరతండ్రి, ముమ్మొనవాలుదారి,