పుట:ఆంధ్రపదనిధానము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

స్వర్గవర్గు


వాలు బటువల్గు నాఁ బిల్లవా లనంగ
నఘనిశాభాస్కర! సుదర్శనాఖ్యలౌను.

12

చుట్టుకైదువు, గుడుసల్గు, చుట్టువాలు, కంటివాలు, వేయంచులకైదువు, నుడివాలు, బటువల్గు, బిల్లవాలు, అనునివి చక్రమునకుఁ బేర్లు.

ఆ.

బిల్లవాల్‌జో డనఁగఁ గఱివేల్పుబూర
గొమ్ము వలమురి పాంచజన్యంబుపేళ్లు;
నీటియిక్క యనంగను నీటిపుట్టు
వనఁగఁ గౌస్తుభమున కాఖ్య లచ్యుతాఖ్య.

13

బిల్లవాలుజోడు, కరివేల్పు, బూరఁగొమ్ము, వలమురి, యనపాంచజన్యము పేర్లు. నీటియిక్క, నీటిపుట్టువు, అననివి కౌస్తుభమణికిఁ బేర్లు.

పంచపాది. గీ.

పాఁపమేపరి గురుడినాఁబక్కిఱేఁడు
బొల్లిగ్రద్ద చిలువతిండి బొల్లఁడు గరు
టాలమంతుఁడు వెన్నునిడాలు పులుఁగు
మన్నియఁడు గరుటామంతుఁడన్న పులుఁగు
బొల్లఁడన గరుడాఖ్యలై చెల్లె శౌరి.

14

పాఁపమేపరి, గరుడి, పక్కిఱేఁడు, బొల్లిగ్రద్ద, చిలువతిండి, బొల్లఁడు, గరుటాలమంతుడు, వెన్నునిడాలు, పులుఁగుమన్నియఁడు, గరుటామంతుడు, పులుఁగుబొల్లఁడు, ఇవి గరుడునిపేర్లు.

సీసమాలిక.

అయిదుమోములవేలుఁ పాబోతురౌ తంగ
            మొలవేల్పు నెలతాల్పు చిలువతాల్పు
తిగకంటి ముక్కంటి దిసమొలవేలుపు
            మినుసిగదేవర మిత్తిగొంగ