పుట:ఆంధ్రపదనిధానము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్గవర్గు

11

కలిమినెలంత, లచ్చిచెలి, కల్ములపొల్తుక, తమ్మియింటిపైదలి, సిరి, తల్లితల్లి, తామరనట్టువ, పైఁడిచాన, పూవిల్తునితల్లి, లచ్చి, కఱివేలుపుటాలు, జగముతల్లి, తమ్ములకైచాన, కడలిఁబుట్టువు, లక్కిమి యనునివి లక్ష్మిదేవికిఁ బేర్లు.

సీ.

అలరువిల్తుఁడు కమ్మవిలుకాఁడు చక్కెర
           విలుకాఁడు మరుఁడు పూవింటిజోదు
వలదొర సిరిచూలి వాలుగడా లించు
           విలతుండు వలవులవేఁటకాఁడు
తుంటవిల్తుఁడు వెడవింటినెయ్యపుఱేఁడు
           తామరతూపరి తలఁపుచూలి
వలపురాయఁడు తావివిలుకాఁడు బేసికై
           దువుజోదు ననవిలుతుండు తీఁగె


గీ.

విలుతుఁడు గురులవిలుకాఁడు చిలుకరౌతు
పచ్చవార్వపుజోదును లచ్చికొడుకు
పచ్చవిలుతాలుపు మొసలిపడగదారి
యనఁగ నివి మన్మథున కాఖ్య లంబుజాక్ష.

11

అలరువిల్తుఁడు, కమ్మవిలుకాఁడు, చక్కెరవిలుకాఁడు, మరుఁడు, పూవింటిజోదు, వలదొర, సిరిచూలి, వాలుగడాలు, ఇంచువిలుతుఁడు, వలపువేఁటకాఁడుఁ, తుంటవిల్తుఁడు, వెడవింటినెయ్యపుఱేఁడు, తామరతూపరి, తలఁపుచూలి, వలపురాయఁడు, తావివిల్కాడు, బేసికైదువుజోదు, ననవిలతుఁడు, తీఁగెవిలుతుఁడు, ఇగురులవిల్కాడు, చిలుకరౌతు, పచ్చవార్వపుజోదు, లచ్చికొడుకు, పచ్చవిల్దాలుపు, మొసలిపడగదారి అనునివి మన్మథునిపేర్లు.

గీ.

చుట్టుకైదువు గుడుసల్గు చుట్టువాలు
కంటివాలు సేయంచులకైదువు సుడి