పుట:ఆంధ్రపదనిధానము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

స్వర్గవర్గు


రంగద్విహంగతుంగతు
రంగ! నృసింహాఖ్య లగుచు రాజిలు నుర్విన్

7

సింగఁడు, మానిసిసింగఁడు, కంబముదొర, నరసింగఁడు, ఇవి నృసింహదేవునిపేళ్లు.

తే.

నేలకూఁతురు నాగటిచాలుపేరి
యతివ యన సీత; సీరాము డనఁగ రాముఁ
డొప్పు; తిమ్మప్పఁ డనఁగఁ దిమ్మప్ప యనఁగ
వెంకటేశాఖ్యలై యొప్పు వేదవేద్య.

8

నేలకూఁతురు, నాగటిచాలు పేరియతివ ఇవి సీతాదేవిపేళ్లు. సీరాముఁడు ఇది శ్రీరామునిపేరు. తిమ్మప్పఁడు, తిమ్మప్ప ఇవి వెంకటేశ్వరునిపేళ్లు.

ఆ.

నాగటిదొర యొంటిప్రోగును దెలిమేని
వాఁడు వెఱ్ఱినీళ్లప్రోడ దుక్కి
వాలుజోదు నల్లవలువతాలుపు
తాటిపడగదారి యనఁగ బలుఁడు దేవ.

9

నాగటిదొర, ఒంటిప్రోగు, తెలిమేనివాఁడు, వెఱ్ఱినీళ్లప్రోడ, దుక్కివాలుజోదు, నల్లవలువతాల్పు, తాటిపడగదారి, ఇవి బలరామునిపేర్లు.

చ.

కలిమినెలంత లచ్చిచెలి కిల్ములపొల్తుక తమ్మియింటిపై
దలి సిరి తల్లితల్లియును దామరనట్టువ పైఁడిచాన పూ
విలుతునితల్లి లచ్చి కరివేలుపుటాలు జగంబుతల్లి త
మ్ములకయిచానయుం గడలిబుట్టువు లక్కిమి నాఁగ లక్ష్మియౌ.

10