పుట:ఆంధ్రపదనిధానము.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(2)

స్వర్గవర్గు

9

ఆర్వేరపురుసి, ముళ్లతపసి, వేల్పుతపసి, సారెలెపుడుమీటెడుజడదారి, పోరుతిండితపసి, ఇవి నారదునికి పేర్లు.

సీ.

నలమేనిదొర పచ్చవలువదాలుపు గట్టు
           తాలుపు కరివేల్పు తమ్మికంటి
గరుడిరౌ తాలకాపరి వలమురితాల్పు
           పక్కిడాల్వేలుపు పసిఁడివల్వ
దారి రక్కసిగొంగ తమ్మిపొక్కిలి లచ్చి
           మగఁడు వెన్నుఁడు మామమామ చుట్టు
వాలుజో దుడ్పనకేల్వేల్పు ముజ్జగం
           బులబొజ్జదేవర నలువతండ్రి


తే.

యనఁగ భవదీయనామంబు లౌను శౌరి
మరునిఁగన్నయ్య నలమేనిదొర యనంగ
వెన్నదొంగ కన్నయ్య నాఁ వెన్నుఁ డనఁగ
నవని భవదవతారకృష్ణాహ్వయములు.

6

నల్లమేనిదొర, పచ్చవలువదాలుపు, గట్టుతాలుపు, కఱివేల్పు, తమ్మికంటి, గరుడిరౌతు, ఆలకాపరి, వలమురితాలుపు, పక్కిడాల్వేలుపు, పసిఁడివల్వదారి, రక్కసిగొంగ, తమ్మిపొక్కిలి, లచ్చిమగఁడు, వెన్నుఁడు, మామమామ, చుట్టువాలుజోదు, ఉడ్పనకేల్వేల్పు, ముజ్జగంబులబొజ్జదేవర, నలువతండ్రి ఇవి విష్ణుదేవునిపేళ్ళు. మరునిగన్నయ్య, నల్లమేనిదొర, వెన్నదొంగ, కన్నయ్య, వెన్నుఁడు ఇవి కృష్ణునిపేళ్ళు.

క.

సింగఁ డనంగను మానిసి
సింగఁడు కంబముదొర నరసింగఁ డనంగన్