పుట:ఆంధ్రపదనిధానము.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

స్వర్గవర్గు


సీ.

బొ మ్మంచరౌ తుడ్పుమోమువేలుపుతాత
             తొలువేల్పు దుగినుఁడు నలువ బమ్మ
చదువులముదుకఁడు చదువులవేలుపు
             పెద్దవేలుపు వేల్పుపెద్ద మొదటి
వేలుపు పొక్కిలిచూలి తామరచూలి
             తమ్మిపుట్టువు ముళ్లతబసితండ్రి
నిక్కపుజగమేలునేర్పరి యననివి
             ధాత్రభిఖ్యలు జెల్లు ధరణిఁ బల్కు


తే.

చెలియ పొత్తువు చదువులచేడియయును
మినుకుగుబ్బెత చదువులమిన్న యన్ను
నలువపడఁతి యనంగను జలరుహాయ
తాక్ష! వాణి కభిఖ్యలై యలరు భువిని.

4

బొమ్మ, అంచరౌతు, ఉడుపుమోమువేలుపు, తాత, తొలువేల్పు, దుగినుఁడు, నలువ, బమ్మ, చదువులముదుకఁడు, చదువులవేలుపు, పెద్దవేలుపు, వేల్పుపెద్ద, మొదటివేలుపు, పొక్కిలిచూలి, తామరచూలి, తమ్మిపుట్టువు, ముళ్లతబసితండ్రి, నిక్కపుజగమేలునేర్పరి, ఇవి బ్రహ్మదేవునిపేర్లు. పల్కుచెలియ, పొత్తువు, చదువులచేడియ, మినుకుగుబ్బెత, చదువులమిన్న అన్ను, నలువపడఁతి, ఇవి సరస్వతీదేవి పేర్లు.

క.

నారదున కాఖ్యలౌ నా
ర్వేరపురుసి ముళ్లతపసి వేల్పుతపసి నా
సారెలెపుడు మీటెడు జడ
దారి యనన్ బోరుతిండితపసి యన హరీ.

5