పుట:ఆంధ్రపదనిధానము.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వర్గవర్గు

7

తెఱగంట్లు, జేజేలు, దేవుళ్లు, చదలుకాపులు, బాసవాళ్లు, వేల్పులు, మింటితెరవర్లు, జన్నపుదిండ్లు, జేజెలు, విగుతెరవరులు, గంగిదిండ్లు, వినుద్రిమ్మరులు, వేలుపులు ఇవి దేవతలకుఁ బేర్లు. దేవుఁడు, దయ్యము, దేవత, ముప్పోకలాడు, ఇవి భగవంతుని పేర్లు. అచ్చరలు తెఱగంటులు వేల్పుగరితలు ఇవి యప్సరసలకుఁ బేర్లు.

సీ.

రక్కసి రాకాసి రక్కసీఁడును రక్క
                      సుండు రేద్రిమ్మరి సోకునల్ల
ద్రావుడు వేలుపుదాయ సోఁకుఁడు తొలు
                      వేలుపనంగ ప్రావేల్పు, పొలసుఁ
దిండియనంగ రేద్రిమ్మరీఁ డీరువుఁ
                      దిండినా మానిసిఁదిండి యెఱచి
మేఁపరియన పొలమేఁతరి యనఁగను
                      రాక్షసాఖ్యలు ఘోరరాక్షసారి


తే.

రక్కసియనంగ రాకాసి రక్కెసలనఁ
దిండివెలఁదియనఁగఁ బొలదిండినాఁగ
నవని రాక్షసకన్యక కాఖ్యలగుచు
వఱలె బాలపురాధీశ భవవినాశ.

8

రక్కసి, రాకాసి, రక్కసీఁడు, రక్కసుఁడు, రేద్రిమ్మరి, సోకునల్లఁద్రావుడు, వేలుపుదాయ, సోఁగఁడు, తొలువేల్పు, ప్రావేలుపు, పొలసుతిండి, రేఁద్రిమ్మరీఁడు, ఈరువుఁదిండి, మానిసిఁదిండి, ఎఱచిమేఁపరి, పొలమేఁతరి ఇవి రాక్షసుని పేర్లు. రక్కసి, రాకాసి, రక్కెస, తిండివెలఁది, పొలతిండి ఇవి రాక్షసస్త్రీకిఁ బేరులు.