పుట:ఆంధ్రపదనిధానము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాంధవాఙ్మయ ప్రత్యేకవ్యక్తిత్వమున కాదర్శప్రాయమనియు విద్యార్ధుల కవశ్యపఠనీయమనియు మాతలంపు.

ఆంధ్రవ్యాకరణసహాయయున రూపాంతరములు సాధింపఁదగిన పగలు పవలు, తోడబుట్టువు తోఁబుట్టువు, వెలది వెలంది, పెనిమిటి పెన్మిటి, ఇగురుచు ఇగ్రుచు, మున్నగు పదములు ఇందు భిన్నపదములుగాఁ జెప్పఁబడినవి. పాదుసా, మస్తీ, హజురు, మున్నగు హిందుస్థాని వికృతిపదములు దేశ్యములుగఁ జెప్పబడినవి. ఆంధ్రవాఙ్మయమున నేయేపదముల కెన్ని పర్యాయపదములు కలవో దెలిసికొనుటకును సంస్కృతసంబంధము లేని యాంధ్రభాషావిస్తృతి గ్రహించుటకును శుద్ధాంధ్రభాషాస్వరూపము నెఱుంగుటకును ఇరువదవశతాబ్దమునాటి కాంధ్రపదములుగ గ్రంథస్థములైన శబ్దములను గుర్తించుటకును నీనిఘంటువు పరమోపకారిక మగునని మాతలంపు. మేము జూచినంతలోఁ బద్యనిఘంటువులలో నిదియె సమగ్రమైనది. లక్ష్మీనారాయణీయమును ప్రత్యేకశుద్ధాంధ్రాకారనిఘంటువు వొకటి గలదు గాని యిరువురుగ్రంథకర్తలు సమకాలికులు, భిన్నస్థలవాసులు, అపరిచితులు నగుటచే నొకరిగ్రంథమువలని యుపయోగమును వేఱొకరు బడసియుండరని మాయుద్దేశము.

ఆంధ్రభాష ప్రత్యేకవ్యక్తిత్వము స్వతంత్రలక్షణములు గల ప్రత్యేకభాష. వికృతివివేకకారుఁడు "భాషేయమమితాతత్ర। దేశ్యాచిత్ర స్వభావయుక్। తచ్చిత్రాతుద్రష్టవ్యా పూజ్యపాద సుభాషితే” యని యాంధ్రభాషను బ్రశంసించినాఁడు. (దీనిచే నాంధ్రభాష పరిమితిరహిత మైనదనియు దేశ్యములు చిత్రములుగ నుండుననియు వ్యాకరణసహాయమున నాచిత్రములు గ్రహింపనగుననియుఁ దెలియనగును) విశాలమగు నాంధ్రదేశమున ససంఖ్యాకజనులచే వ్యవహృతముగు నాంధ్రభాషలోఁ బదసముదాయ మమితముగఁ గలదు. ఎన్నియో పదము లింకను గ్రంథస్థము కావలసియున్నది. అరణ్యకులగు చెంచులు, ఏనాదులు, కోయలు, బోయలు, మాటలాడుపదములం దెన్నియో యాంధ్రపదములు గెలవు. నిజాంరాష్ట్రమున మహమ్మదీయసంపర్కములేని మండలములు కొన్నికలవు. తన్మండలవాసులు వ్యవహరించు విలక్షణాంధ్రవాఙ్మయమునుండి గ్రంథస్ధము కాఁదగినపదము లెన్నియో గలవు.ఇటులే యాంధ్రవాఙ్మయ మమితమైనదను నిర్ణయమున కీయాంధ్రపదనిధానము తోఁడడఁగలదు, త్రిలింగములలో నొకటియగు కాళేశ్వరక్షేత్రమునకు నెలవైన పశ్చిమాంధ్రదేశమున నెన్నియో యుత్తమగ్రంథములు నన్నయనాటినుండి నిన్నటి