పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వందనాపూర్వకవాక్యముల్ వదరుచు
            నలమటలకు నోర్చి బలిమి గలిగి
దూరకార్యజ్ఞుఁడౌ దొరఁ గెల్చు దొరయగు
            గుణము లన్నియునుఁ జేకూడెనేని


గీ.

కడుఁ బ్రతాపగుణంబైనఁ గలుగవలయుఁ
దెలిసి చూడఁ బ్రతాపంబు గలుగువాని
రఖిలశత్రులు వెఱతు రియ్యవనిలోన
మృగపతికి నోడి యొదిఁగెడి మృగము లనఁగ.

8


క.

అతులప్రతాపనిధియగు
పతి నేకొనుచుండు నెపుడు బలువగు సిరి నీ
క్షితిఁ గావున నుత్సాహము
గతినేచేతఁ బ్రతాపగుణమె కైకొనవలయున్.

9


క.

ఇల నేకార్ధప్రీతిం
గలహించిన శత్రు వగుచుఁ గనఁబడు నందున్
బలవజ్జిగీషుగుణముల
నలరిన వెడిదంపుఁ బగతుఁ డండ్రు నయజ్ఞుల్.

10


గీ.

పిఱికి సోమరి క్రూరుండు పిసిఁడి చంచ
లుండు మూఢుండు సత్యహీనుండు మోస
పోవునాతండు యోధులఁ గావరించి
పలుకునతఁడును సాధ్యుండు పరుల కెందు.

11

మండలస్వరూపము తద్భేదములు

వ.

మఱియు మండలస్వరూపం బెట్లన్నను బరాశరుండు విజిగీషువు
సిరియు నన్యోన్యజయేచ్చ గలవారగుటంజేసి వీర లిరువురకు
నేకప్రకృతియ కావున నీప్రకృతియ మండలంబని బలుకు

12