పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్టి విజిగీషు వైనట్టి రాజునకు నమాత్యుండును రాష్ట్రంబును
దుర్గంబును భండారంబును బలంబును నియ్యైదును బందప్రకృతు
లని నీతిజ్ఞులైన వారలు పలుకుచుండుదురు. మఱియును
బృహస్పతిమతంబువార లీ పంచప్రకృతులకు రాజును మిత్రుం
డునుం గూడ సప్తప్రకృతులం గలిగినది రాజ్యంబని పలుకు
చుండుదు రిట్టి ప్రకృతులతోడం గూడికొని మహోత్సాహుండై
యిన్నిటియందును నభ్యాసంబు గలిగినవాఁడై శత్రువులం గెలువ
నిశ్చయించినరాజు విజిగీషు వనంబరగు నట్టి విజిగీషువైన
రా జెట్టివాఁ డనిన.

6

కౌలీన్యాది విజిగీషు గుణములు

సీ.

కులమును బుద్ధియున్‌ గలిగి యుత్సాహియై
           చిత్తజ్ఞుఁడై వృద్ధసేవి యగుచు
కడు నియ్యనేర్చి ప్రగల్భుఁడై సత్యంబు
           సడలక పనులందు జడతలేక
కలఁగక వినయంబు గలిగి స్వతంత్రుఁడై
           దేశకాలజ్ఞుఁడై దిటము గల్గి
యన్నియు నెఱిఁగి మాటాడగా నేరిచి
           దక్షుఁడై గుప్తమంత్రంబు గలిగి


గీ.

మిగులఁ బోటరియై బత్తి మే లెఱింగి
పాపకర్ములు గాకుండు బంట్లు గల్గి
శాస్త్రదృష్టనిజాచారచతురుఁడైన
యతని విజిగీషు వండ్రు మహాత్ములెల్ల॥

7


సీ.

బహుళరాజ్యాంగుఁడై బడలికలను గెల్చి
             జాడ్యంబుఁ జపలత జాఱవిడిచి
చతురుఁడై రిత్తయై దనని కోపము గల్గి
            శరణాగతులను వత్సలతఁ బ్రోచి