పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రకామందకము

చతుర్ధాశ్వాసము

క.

శ్రీకర రఘురామగుణా
నీకస్తుతిచతురనీతినిర్ణయనిపుణా
కోకహితవంశతిలకశు
భాకర కొండ్రాజు వెంకటాద్రి నరేంద్రా॥

1


వ.

అవధరింపుము.

2

మండలయోని ప్రకరణము

గీ.

బలము భండారమును గల్గు పార్థివుం డ
మాత్యులను మంత్రులను గూడి సుతుల లెస్సఁ
గా విచారింపవలయు దుర్గమున నుండి
మహిమ పెంపొందుచుండెడు మండలముల.

3


క.

పరిపూర్ణమండలుండై
ధరి రంజిలఁ జేయుతుహినధామునిమాడ్కిన్
బరిపూర్ణమండలుండై
నిరతము విజిగీషువైన నృపతి దనర్చున్.

4


క.

జనపతి విశుద్ధమండల
మున మెలఁగిన రథికుచందమున నెల్లపుడుం
దనరు నవిశుద్ధమండల
మున మెలఁగ రథంబు చక్రముంబలె నలఁగున్.

5