పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అదియును విగృహ్యయానంబును, సంధాయయానంబును,
బ్రసంగయానంబును, సంభూయయానంబును, నుపేక్షా
యానంబు నని యైదుతెఱంగు లయ్యె వానిస్వరూపంబులు గ్రమం
బున వివరించెద.

133


సీ.

బలవంతుఁ డరిప్రధానుల నిగ్రహించి దం
           డెత్తుటయును దనహితులచేత
నరిమిత్రులను నొంచి యరిమీఁద దండెత్తు
           నదియును విగ్రహయాన మండ్రు
వెనుక శత్రులసంధి నొనరి యన్యులమీఁద
           నరుగుటయును దను నడ్డకట్టు
విమతులు సంధించి వేఱొక్కయరిమీఁద
           నరుగుట సంధాయయాన మందు


గీ.

రొక్కచోటికిఁ గదలి వేఱొక్కయెడకు
శల్యురీతిఁ బ్రసంగవశంబుకతనఁ
జనిన యది ధాత్రియందుఁ బ్రసంగయాన
మండ్రు నయశాస్త్రవిదు లైనయార్యు లెందు.

134


సీ.

శౌర్యశక్తుల మించి చాలమూఁకల గూల్పఁ
            గలిగిన సామంతగణముతోడఁ
గలసి శాత్రవులను గదుమ నుద్యోగించి
           కదలిపోవుట చూడ నదియుఁగాక
ఫల మిత్తునని ప్రతినలు పల్కి కొంచెపు
           దొరలతోఁ గూడుక యరుగునదియుఁ
దమప్రకృతుల నొంపఁ దా రిరువురు గూడి
           యిరువురు శత్రుల నే పడంప