పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

మునుపు సూర్యాంజనేయులు సనినరీతి
నరుగుటఁ దలంప సంభూయయాన మండ్రు
రిట్టి యానప్రకారంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

135


సీ..

శత్రుపై దండెత్తి చనుచోట నహితున
            కపుడు సహాయుఁడై యతనికంటె
బలవంతుఁడగురాజు పై నెత్తి వచ్చిన
           మునుపటిశత్రుపైఁ జనక తాను
వాని నుపేక్షించి వానిసహాయుపైఁ
           జన నుపేక్షాయాన మనఁగ బరగు
వాసవసూతి నివాతకవచులపైఁ
           జని యుపేక్షాయానముననె తొల్లి


గీ.

ప్రబలులై మించినట్టి హిరణ్యపురని
వాసులను గెల్వఁ గదలినవైపు దనర
నిట్టియానప్రకారంబు లెఱుఁగవలయు
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

136


గీ.

అరికి వ్యసనంబు గల్గినయట్టివేళ
నరికి దైవంబు దోడుగానట్టివేళ
నదనుఁ జేకొని దండెత్త నర్హ మండ్రు
నీతిమార్గం బెఱింగిననృపవరునకు.

137

ఆసనప్రకరణము

వ.

ఆసనప్రకారంబు.

138


క.

అరియును విజిగీషుధరా
వరు లిరువురు బలికికలిమి వడి నొండొరులన్
దెరలింపలేక యుండుట
ధర నాసన మనఁగఁ బరగుఁ దజ్‌జ్ఞులచేతన్.

139