పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

కలహంబైన నుపాయ
మ్ములచేతనె తాళి శాంతిఁ బొందింపఁదగున్
గెలుపులు దలఁప ననిశ్చయ
ములు గావునఁ ద్వరితగతుల మొనయక నృపతుల్.

122


క.

బలవంతుండగు శాత్రవుండు గినుకన్ బై వచ్చి బోధించినన్
గలఁగన్‌ బాఱక నిత్యసంపదల నాకాంక్షించుచున్‌ బుద్ధిని
శ్చలతన్ వైతసవృత్తిచే వినతుఁడై శత్రుం బ్రసన్నాత్ముఁగా
నలరింపందగు సర్పవృత్తు లటు పాయంబెట్టి నేర్పొందుగన్.

123


ఆ.

పామురీతిఁ గ్రూరభంగిఁ జరించిన
విభుఁడు నాశ మందు వేగ జగతి
సిరులఁ జెందుచుండుఁ దిరముగాఁ బ్రబ్బళ్ళ
లీల వినయవృత్తి వాలునతఁడు.

124


ఆ.

మత్తురీతి వెఱ్ఱిమాడ్కిఁ దా నూరక
యుండి వేళఁ బైకి నుఱికి సింహ
మటులఁ గ్రమముచేత నందినయది జాఱ
కుండఁ బట్టి విజయ మొందవలయు.

125


సీ.

తాఁబేటిలీల యెంతయును ముడుంచుక
            తనమీఁద వచ్చు బాధలకుఁ దాళి
గట్టుకైవడి నిల్చి కదలక యోర్చుచు
            ననువు గాకుండెడియట్టివేళ
యరిని మూపునఁ బెట్టియైన మోపఁగ నేర్చి
            ప్రియభాషణంబులఁ బేలుపఱచి
కడుబ్రసన్నాత్ముఁడై పుడమివార్త లెఱింగి
            యరియంతరంగంబునందు నిల్చి