Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మానుపఁగావలె మఱి యిట్లు పొడమెడి
            కలహముల్ దా మాన్పఁగడఁగఁడేని
సర్వంబు నొకవేళఁ జాలనాశన మొందుఁ
            గావునఁ గడు విచక్షణత మించి


గీ.

యేయుపాయంబుచేఁ బీడ యెసఁగకుండ
నాయుపాయంబుచే విగ్రహంబు లెల్ల
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

112


వ.

మఱియుఁ గొన్నిమతంబులవారు శత్రువర్తనమువలనను,
గ్రహంబులవలనను, వనితలవలనను, వాగ్దోషంబువలనను,
నపరాధంబువలనను, బుట్టెడి వైరంబు లైదువిధంబులే యని
పల్కుచుండుదురు. బాహుదంతతనూజుండు భూమియోర
లడ్డగించుటవలనను, భూమిబాధ గలుగుటవలనను, శక్తి
చెఱుచుటవలనను, గడిరాజువలననుం బొడమెడి వైరంబులు
నాలుగువిధంబులే యని పలుకుచుండు. మనుమతంబువారు
కులమువలనను నపరాధంబువలననుం బొడమెడి వైరంబులు
రెండువిధంబులే యనియును బలుకుచుండుదు రైన నందుఁ బూన
రాని విగ్రహంబులు బదియాఱువిధంబులు గల వవి యెట్లనిన.

113


సీ.

అల్పఫలంబైనయది నిష్ఫలంబును
           ఫలము నిశ్చయలీలఁ బరగునదియు
నపుడు దోషము గల్గి యామీఁద ఫల మిచ్చు
           నదియును దోషంబు లపుడు లేక
యటమీఁద ఫలయుక్తి నలరకుండెడునది
           యపుడు మీఁదట దోష మందునదియుఁ
దా నెఱుంగనిశూరతను మించువానిది
           పరులు ప్రేరేపఁ జొప్పడునదియును