పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


అవమానమునఁ గల్గు నావిగ్రహం బను
             నయముతోఁ గూడుమానంబుచేత
అభిమానమునఁ బుట్టినట్టి వైరంబు సా
             మంబుచేతను బ్రణామంబుచేత


గీ.

బంధునాశంబువలనఁ జొప్పడినపోరు
దగిన యట్టి రహస్యవర్తనముచేత
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

110


సీ.

ఏకార్థమునకుఁగా నిరువుర కగుపోరు
           తనకోర్కి వదలి వీడ్కొనుటచేత
ధనముఁ గైకొనుటచే నొనరినజగడంబు
           క్రోధంబుఁ జాలించుకొనుటచేత
నడరి చేయుననుగ్రహము మాన నగుపోరు
           మగుడి యనుగ్రహమహిమచేత
దైవికగతిచేతఁ దనకైనజగడంబు
           దైవంబు గూర్చుయత్నంబుచేత


గీ.

మండలక్షోభముననైన మచ్చరంబు
నందు కొనఁగూడి తగునుపాయములచేత
మందటిలఁజేయవలయు నెమ్మదిఁ జెలంగి
నీతిమార్గం బెఱింగిననృపవరుండు॥

111


సీ.

మించి దేశంబు బాధించఁగానైనపో
           రతనిదేశముఁ గూల్చు నందుచేత
బహుజనంబులతోడఁ బరగినజగడంబుఁ
           దగుసామదానభేదములచేత