పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నర్ధవిఘాతంబువలనను, ధర్మవిఘాతంబువలనను, జ్ఞానాప
హారంబువలనను, జ్ఞానశక్తివిఘాతంబువలనను, మిత్రార్థంబు
వలనను, నవమానంబువలనను, నభిమానంబువలనను, బంధు
నాశనంబువలనను, నేకార్ధప్రీతివలనను, ధనాపహారణంబువలనను,
గృతానుగ్రహభేదంబువలనను, దైవంబువలనను, బ్రకృతి
క్షోభంబువలనను, దేశపీడనంబువలనను, బహుజనద్వేషంబు
వలనను, గలుగుచునుండు నిందుకు శమనప్రకారం బెట్లన్నను
గ్రమంబున వివరించెద.

108


సీ.

స్థానరాజ్యములకు సతులకు మఱియు దే
          శములకుఁ గా వచ్చు జగడమెల్ల
పుచ్చుకొన్నవి మళ్ళ నిచ్చుటచే నొరుల్
          గైకొన్నదమయుక్తిఁ గనుటచేత
నర్థంబు ధర్మంబు నడపఁబో రొదవఁ దొ
          ల్తటియట్ల యిచ్చి యేర్చుటలచేత
జ్ఞానాపహారంబు జ్ఞానశక్తివిఘాత
          ముల నైన జగడంబు చలము కొనక


గీ.

పట్టునర్థంబు వదలి చొప్పడుటచేతఁ
దనకొనర్ప నుపేక్షచేఁ దాల్మిచేత
మందటిలఁ జేయవలయు నెమ్మదిఁ జెలంగ
నీతిమార్గం బెఱింగిననృపవరుండు.

109


సీ

ద్రోహం బధర్మంబుతోఁ గూడుమిత్రుని
          కలహంబుఁ దనయుపేక్షణముచేత
నెనసినమంచిమిత్రుని కైనజగడంబుఁ
          దనదిగా వహియించుకొనుటచేత