Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కాలోచితంబైన క్రమమున సామదా
          నంబులచేత భేదంబుచేత
నటు మట్టుఁ నడ నుండి యామీఁదఁ దా మించి
          యరి కసాధ్యంబైనయచట నిలిచి


గీ.

చతురగతిఁ బొల్చి సన్నాహసహితసైన్య
పటలిచేతను జీకాకుపఱుపవలయు
నతఁ డెటులఁ దప్తుఁడై కూడు నటుల విభుఁడు
'తప్తయోస్సంధి' యనెడి శాస్త్రం బెఱింగి.

103


క.

ఈరీతి సంధికార్యము
దారు వచింపుదురు మునులు తత్సంధి బలా
త్కారముననైనఁ గార్యము
గౌరవలాఘవము లెఱిఁగి కావింపఁదగున్.

104


వ.

ఇది సంధిస్వరూపంబు. ఇంక విగ్రహస్వరూపంబు వివరించెద.

105

విగ్రహవికల్పప్రకరణము

క.

తమలోఁ దా రెప్పుడు కో
పముల నసూయలను బెరసి పలుమరు నపకా
రములె యొనరించుటలచే
నమరంగాఁ బొడము విగ్రహము మహిలోనన్.

106


ఆ.

ఫలముగోరువాఁడు పగవారిచేతను
వెతలఁ జెందువాఁడు చతురుఁ డగుచు
నహితుతోడ విగ్రహము సేయవలయును
బలము దేశకాలబల మెఱింగి.

107


వ.

ఇట్టి విగ్రహంబు స్థానాపహారంబువలనను రాజ్యాపహారంబు
వలనను, వనితాపహారంబువలనను, గ్రామాపహారంబువలనను,