పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

ఇట్టియత్నంబులు చేసినను బెట్టిదుండగునట్టిపగఱ మట్టుఁబడక
బిట్టు గదిమినయేని వెండియు.

99


సీ.

బహువేషభాషలఁ బరగినవారలై
          యాభిచారికనిమిత్తాదు లెఱిఁగి
యాశత్రుదేశంబు నందె కాపుర ముండి
          సంచరించెడుఁ దనచరులచేత
నొకకొన్నిప్రశ్నలు నొకకొన్నిశకునముల్
          కడు నిదర్శనములు గాఁగఁ దెలుపఁ
జేసి శత్రుల విశ్వసింపఁ గావింపుచు
          వారిచేతనె బహువ్యసనములును


గీ.

భీకరోత్పాతములును గల్పింపఁజేసి
యిట్లు శత్రునియుత్సాహమెల్లఁ జెఱచి
వానిఁ దోఁదోలవలయు నవార్యమహిమ
నీతిమార్గం బెఱింగిన నృపవరుండు.

100


గీ.

పుత్రమిత్రకళత్రాప్తమారువిత్త
వాహనాదులు గదనంబువలన నొక్క
నిమిషమున వ్యర్థమగుట లో నృపతి యెఱిఁగి
మిగులఁ గలకాంబులకుఁ బూని మెలఁగరాదు.

101


క.

బలమును ధనమును జుట్టం
బులు నిజదేహంబు రాజ్యమునఁ గీర్తితతుల్
దలఁకుచు సంశయడోలా
కలితముగాఁగనె వివేకి కదన మొనర్చున్.

102


సీ.

తనసరిదొరయైనఁ దనమీఁద దండెత్తి
           తనతోడ సంధి గైకొనకయున్నఁ
దా నటమీఁద నాతనితోడ సంధి గా
           వలసినవాఁడెయై వైర ముడిగి