పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

దగుప్రియంబులె పల్కి తనదుశౌర్యము తన
          కనువైనవేళ సేయంగ వలయు
నది యటులన్న న ట్లనుసరింపుచుఁ దొల్లి
          విశ్వాస మందించి వేళ యెఱిఁగి


గీ.

ఘనుఁడు దేవేంద్రుఁడు దితి కడుపుఁ జొచ్చి
కడుపులోనున్న పగఱ వ్రక్కలుగఁ జీఱి
యల మరుద్గణకర్తయై యతిశయిల్లె
నిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.

96


సీ.

బలవంతుఁడగురాజు చలమునఁ బై నెత్త
        నాతనియువరాజు నతనిమంత్రి
తోనైనఁ దాను సంధానంబు గావించి
        వారిలో వారికిఁ బోరుఁ బెట్టి
యదియును గాకున్న నతనిప్రధానున
        కెంతయుఁ దా ధన మిచ్చియైన
వలయు నర్థముల లేఖల నిచ్చి యైనను
        బరునియత్నంబులు సెఱుపవలయు


గీ.

నిన్నిరీతులఁ గార్యంబు లెసఁగకుండఁ
జేయఁ గడునుగ్రుఁడై వైరిచెంత నుండు
వారిపై నెల్లను గడువిశ్వాస మొంది
యతఁడు సేసినయత్నంబు నతఁడె మాను.

97


క.

అరియత్నము లుడుపఁగఁ దగు
నరిమిత్రుల సంధి చేసియైనను లేదా
యరివైద్యుల భేదింపుచు
నరిఁ జెఱుపఁగవలయు రసవిషాదులనైనన్.

98