పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

సముతోడ నైనసంధియు
నమరుల గెలుపోటమియును ననిలో సందే
హముగన నిట్లనె పలుకఁడె
యమరగురుఁడు నిశ్చితార్థ మది కాదంచున్.

91


చ.

బలియఁగఁ గోరురాజు దనబల్మికి మున్ను సమానవైరితోఁ
జలమునఁ బోరఁగాఁ జనక సంధియె చేయుట మేలు కానిచో
నలవడఁ బచ్చికుండ మెరయంబడి రెండుగ వ్రీలుకైవడిన్
బొలియుటె కాక గెల్పులను బొందుట లెందును జెందనేర్చునే.

92


ఆ.

సముల మనుచు బదరి సంధి సేయక మీఱి
పోరి యిరువు రొకట బొలియరైరె
పందలై నయట్టి సుందోపసుందులు
గాన సములు సంధిఁ బూన మేలు.

93


ఆ.

తనకు వ్యసనమైనతఱి హీనుఁ డెత్తిన
సంధి సేయఁడేని చాలఁగీడు
తడిసినట్టివానియొడలిపై నొకమంచు
బొట్టు బడిన వడఁకు పుట్టకున్నె.

94


క.

హీనుఁడగు వైరి యెడలం
దా నెందును వ్యసన మెడలుతఱి సంశయము
న్మానుచు నిర్దయుఁడై పతి
వానియవిశ్వాస మెఱిఁగి వధియింపఁదగున్.

95


సీ.

అరి కడుబలవంతుఁడైన సంధియుఁ జేసి
           చేరి విశ్వాసంబుఁ జెంద నడచి
తాను నమ్మినయట్టివానికైవడి నుండి
           తనయింగితాకృతుల్ గనఁగనీక