పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


జేయరానిబాస సేసియు నింద్రుండు
వృత్రుఁ జంపినట్టివిధ మెఱింగి.

84


ఆ.

తనయుఁడైన ననుఁగుదండ్రియైనను రాజ్య
మంది యొకనిభార మొందుఁ గాన
లోకజనముచర్యలోనిది గాకుండ
ధరణిపతులనడకఁ దలఁపవలయు.

85


క.

బలవంతుఁ డెత్తివచ్చిన
నలుకక దుర్గమున నిల్చి యంతటికంటెన్
బలవంతుఁ దెచ్చి తఱుమఁగ
వలయుఁ బటాపంచముగ నవారితశక్తిన్.

86


వ.

మఱియు భరద్వాజమతంబున.

87


క.

తనయుత్సాహము బలిమియుఁ
గనుఁగొని యరిమీఁద కుఱికి కలహింపఁదగున్
ఘనసింహ మెదిరి మదకరు
లను వెంటాడంగఁ బూనులాగున నెందున్.

88


క.

ఉదుటుగల సింహ మొక్కటి
మదగజసంఘములఁ గెల్చుమాడ్కిఁ బగఱపైఁ
బొదలిన తనయుత్సాహము
నుదుటుం గని గమకమునన నుఱుకఁగవలయున్.

89


క.

కడునల్పసైన్యునైనను
బడలికఁ బడి యొక్కశత్రు భంజించినచోఁ
బొడవైన తత్ప్రతాపము
కడిమినె యిల నితరశత్రుగణముల బొగడున్.

90