పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బ్రతుకవలసిన భూపతి బలియుతోడ
సంధి సేయంగవలయు నిశ్చయము గాఁగ.

80


ఆ. వె.

అధికుఁ డెదుర నమ్రుఁడై వేళయైనచో
విక్రమించునట్టివిభునిసిరులు
చెంది వెలయు గట్టుచెంతఁ నమ్రతఁ జెంది
యవలఁ బ్రబలునదులయంద మొంది.

81


సీ.

దాయాదవర్గంబు దనకు గల్గినవాఁడు
           కడుమూఁకఁ జెందిన కారణమున
భేదింపరాకుండుఁ బెనుముండ్లు బలసిన
           వెదురులపొదలోని వెదురుమాడ్కి
సత్యవంతుఁడు దనసత్యంబు నడుపుచు
           సంధికృత్యంబుల జారకుండు
గెలుపు లెయ్యెడఁ బెక్కు గలవాఁడు దొరకెనా
           పరశురామునిఁ బ్రతాపమునఁ వోలి


గీ.

యతనిశౌర్యంబుచేతనే యఖిలదిశల
మించుభూపతులెల్లఁ గంపించియుందు
రిట్టివార లసాధ్యులౌ టెఱిఁగి విభుఁడు
సంధి సేయంగవలయు నీజగతిలోన.

82


క.

పెక్కుజయంబులు గల దొర
నొక్కటిగా సంధి గూడు నుర్వీవిభునిం
దిక్కని గొల్తురు వైరులు
చక్కనగాఁ దత్ప్రతాపసంతాపితులై.

83


ఆ. వె.

సంధి యయ్యె ననుచు సత్యవంతులనైన
నమ్మియుండఁజనదు నరవరునకుఁ