పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అది యెట్లనిన, నిట్లు సంధానార్హులైన యేడుగురితెఱఁగును
గ్రమంబున వివరించెద.

78


సీ.

ఆర్యుఁడై తగువాఁడు ప్రాణబాధలయందుఁ
            దనమంచితనమె వదలక యుండు
ధార్మికుం డెందును దనధర్మమహిమచేఁ
            గడుఁ బ్రజారాగంబు గలుఁగుకతన
నతఁ డెదిరించిన నతనికై యందఱు
            నని యొనర్తురు కాన నతఁ డసాధ్యుఁ
డగు ననార్యుండైన యతఁడు గూడకయున్న
            నతఁడు శత్రులఁ గూడి యడఁగఁజేయు


గీ.

మొదలు ముట్టంగఁ బరశురామునివిధమున
నిట్టివార లసాధ్యు లౌ టెఱిఁగి యందు
సంధి గావించవలయు నీజగతిలోన
నీతిమార్గం బెఱింగిన నృపవరుండు.

79


సీ.

అధిరుఁ డెంతయు నల్పు నాక్రమించినచోట
            నెన్నియత్నంబుల నెనసియైన
నతఁడు దా బలుసింహ మాక్రమించినలేఁడి
            లీల నెందును దిక్కు లేక యుండు
నధికుతో నేమాత్రమైనను గినిసిన
            నల్పుండు మొదలంట నపుడె చెడును
బలవంతుతోడుతఁ గలహించుమని నీతి
            శాస్త్రంబు బలుకు టెచ్చటను లేదు


గీ.

మొనసి పెనుగాలి కెదురని మొగిలు కరణి
నధికుతో నల్పుఁ డెదురలేఁ డటులఁగాన