పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


డనువుగా సంధి గైకొనినమీఁదట నైనఁ
           బదరునుఁ దా మల్లబడి కలంగు
తలము దప్పినయట్టి దంతావళము నీటఁ
           గొంచెపుమొసలిచే గుదిసినట్లు


గీ.

నెలవు దప్పినయాతండు సెలఁగి క్షుద్ర
శాత్రవునిచేతనైనను సమయుచుండుఁ
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
లిట్టివారలతో సంధి నెనయరాదు.

75


సీ.

దేవుళ్ళఁ నావలఁ దిట్టునాతఁడు ధర్మ
           హీనుండు గావున నీల్గుచుండుఁ
గనుఁగొనలేక చీఁకటిలోనఁ గాకంబు
           ఘూకంబుచేతను గూలినట్లు
కాల మెఱుంగక కలహించునాతండు
           గాలజ్ఞయోధచేఁ గూలుచుండు
నాపదలకు మఱి యధికసంపదలకు
          దైవంబె కద నిమిత్తం బటంచు


గీ.

దైవచింతకుం డన్నియత్నములు మాని
యూరకుండియ చెడుచుండు నుర్విలోనఁ
గాన వీరలతో సంధి గాదు తలఁప
నిట్టిమార్గంబు నరవరుఁ డెఱుఁగవలయు.

76

సంధి కర్హు లగువారు

గీ.

ఆర్యుఁడును ధార్మికుండు ననార్యుఁ డధిక
బలుఁడు దాయాదవర్గంబు గలుగునతఁడు
సత్యవంతుండు బహుజయశాలి సంధి
కర్హులని పల్కుచుండ్రు నయజ్ఞు లెందు.

77