పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నరిచేత లంచంబు లంది పిచ్చతనంపు
          బంటులు పతిఁ గీడుపఱతు రెపుడు
లోభి జీతము లీయ లొంగెడుకతమున
          బంటులు మొగియరు బవరమునకు


గీ.

విరసరాజ్యాంగుఁ డరులతోఁ దుర మొనర్ప
విసివి రాజ్యాంగములు వాని విడిచిపెట్టు
విషయసక్తుని గడుసుఖవృత్తి గెలువ
వచ్చుఁ గావున వీరితో వలదు సంధి.

73


సీ.

బహువిచారంబులు బహుచిత్తములు గల్గు
          పతి మంత్రులకు నెల్లఁ బగతుఁ డగుచు
దలచిత్త మందుటవలనఁ గార్యంబుల
          యెడ వారిచేతనే విడువఁబడును
పెక్కుడేగలయందుఁ జిక్కుపావుర మన
          బహువైరి యగువాఁడు పదరి చెదరి
యెట్టిత్రోవలఁ బోవు నట్టిత్రోవలయందె
          స్రుక్కి శాత్రవులచేఁ జిక్కువడును


గీ.

కరువు వ్యసనంబులును జెంది కలఁగువాఁడు
కోలుకోలేక తనుఁ దానె కూలుచుండుఁ
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
నిట్టివారలతో సంధి నెనయరాదు.

74


సీ.

వ్యసనముల్ గలిగినయట్టిబలంబులు
            గలవాఁడు పోటు కెక్కంగలేఁడు
దైవోపహతకుఁడు తనుఁ దానె చెడుచుండు
            సత్యంబు ధర్మంబు సడలినయతఁ