పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆ.

దైవహతుఁడు సత్యధర్మహీనుఁడు లావు
విడిచినతఁడు సురల ద్విజుల నెపుడు
గడవ నాడువాఁ డకాలయోధియు దైవ
చింతకుండు సంధి సేయఁ దగరు.

70


వ.

అది యెట్లనిన నిట్టియిరువదితెఱంగులవారును సంధానార్హంబు
గాకుండుటకుం గారణంబులు గలవు వివరించెద.

71


సీ.

బాలుం డెదురు గాఁగఁ జాలనికతమున
          నని సేయఁగాఁ బూన రతనిబంట్లు
తానును నని సేయలేనివానికి నుప
          కారార్థ మెవ్వండు పో రొనర్చు
ముసలివాఁడును రోగములు గల్గువాఁడు ను
          త్సాహశక్తులులేమి తమజనంబు
చేతనే భంగంబుఁ జెందుదు రెందును
          విరసుఁడై జ్ఞాతుల విడచినయతఁ


గీ.

డరికిఁ గైవసమై యుండు నట్టిజ్ఞాతి
జనులచేతనె మున్నుగాఁ జంపఁబడును
గాన వీరెల్ల సుఖసాధ్యు లైనవార
లిట్టివారలతో సంధి నెనయరాదు.

72


సీ.

కోఁచవాఁ డని సేయఁ గొఱఁగానికతమునఁ
           దనుఁ దానె వెఱచి నాశనముఁ జెందు
కడుఁగోఁచబంటులఁ గలధీరుఁడైన నా
           బంట్లచే నాజి నిప్పాటుఁ బొరయు