Jump to content

పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.

అదియు గొన్నిమతంబులవారు కపాలసంధి, యుపహారసంధి,
సంతానసంధి, సంగతసంధి, యుపన్యాససంధి, ప్రతీకారసంధి,
సంయోగసంధి, పురుషాంతరసంధి, యదృష్టనరసంధి, యాదిష్ట
సంధి, యాత్మామిషసంధి, యుపగ్రహసంధి, పరిక్రియసంధి,
యుచ్ఛిన్నసంధి, పరదూషణసంధి, స్కందోపనేయసంధి, యనం
బదునాఱువిధంబులుగాఁ బలుకుదురు. ఇవి కొన్నిమతంబుల
వారు పరస్పరోపకారసంధియు, మైత్రసంధియు, సంబంధ
సంధియు నుపహారసంధియు నన నాల్గుతెఱంగులే యని
పల్కుచుందు రైనను నిందులో నుపహారసంధి యొక్కటియ
యీకామందకమతంబునకు సమ్మతంబు. అది యెట్లనిన
నెందును దనమీఁద దండెత్తివచ్చిన బలవంతుం డగుశాత్రవుం
డెందైన నొకటిఁ గానుకఁ గొనక మగుడి చనండు కావున
మైత్రిచే నైనసంధి యొక్కటి దక్క దక్కినసంధు లన్నియు
నియ్యుపహారసంధిలోని భేదంబులే యగు నైన నీపదియాఱు
సంధుల స్వరూపంబుఁ గ్రమంబున వివరించెద.

65


సీ.

సమసంధియ కపాలసంధియై పొలుపొందు
            నుపహార మీఁగిచే నొనరుచుండు
సంతానసంధి నాఁ జనుఁ గూఁతు నిచ్చినఁ
            గడుమైత్రి నెనయ సంగతపుసంధి
కలకాల మది యొక్కగతిఁ బ్రవర్తింపుచు
            సమకార్యములు గల్గి చాల మించి
యాపదలందును నధికసంపదలందు
            భేదంబు చెందక పెంపుఁ జెంది