పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

నేరము లేవియుఁ బొరయని
వారిని దండించునట్టివసుధావిభునిం
గ్రూర మగుపాముఁ జూచిన
తీరునఁ బ్రజలెల్లఁ జూచి తిట్టుదు రెపుడున్.

53


క.

తగ నధికమధ్యమాధము
లగుమిత్రులతారతమ్య మరయఁగ వలయున్
దగ నధికమధ్యమాధము
లగువారలపనియుఁ దెలియనగు నధిపతికిన్.

54


గీ.

తెలియ కెవ్వరినైన నిందింపరాదు
లేనినిందలు గట్టెడువానిపలుకు
దగిలి వినరాదు మిత్రభేదములు పూని
సేయువారలఁ బతి చేరనీయరాదు.

55


క.

పాటించి తెలుప నోపని
మాటయు మచ్చరపుమాట మధ్యస్థంబౌ
మాటయును బక్షపాతపు
మాటయుఁ బతి లెస్సఁ దెలిసి మఱి సేయఁదగున్.

56


క.

తనచుట్టములకుఁ బోరొం
దిననొక్కనిఁ బట్టి వాదు నెఱపక వేగం
బున వారలలో వారికిఁ
గినుకలు మాన్పంగవలయు క్షితిపతి యెందున్.

57


ఉ.

కాలముపేర్మిఁ దా ఘనము గౌరవ మొందుచు నుండుఁ గానఁ ద
త్కాల మెఱుంగురాజు గుణకల్పన కొంత ఘటించి నీచునిన్
జాలఁగ సంస్తుతింపఁ దగు సారెకు నాతని దుర్గుణంబు లె
వ్వేళను గప్పి పెట్టుచు వివేకవిలోకనచాతురీగతిన్.

58