పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


చ.

పటుబలుఁడైన మధ్యముఁడు పైఁ దగ దం డొనగూడి వచ్చినన్
గుటిలత మాని తాను నరికూటువఁ గూడుచునుండు టొప్పుఁ దా
నటువలె శక్తుఁడై నిలుచునంతటి పూనిక నూనకుండుచోఁ
చటుకున సంధి సేయఁదగు దానవిధాననిదానలీలలన్.

29


గీ.

అధికుఁడైన యుదాసీనుఁ డడరినపుడు
సకలమండలనాథులు నొకటి యగుచు
సంఘధర్మంబుమై నుండఁ జనునపుడును
బలిమి లేకున్న శరణొంది బ్రతుకవలయు.

30

సంఘధర్మస్వరూపము

క.

ఘనముగ నాపద లొదివిన
జనపతు లందఱును గూడి స్వార్థముకొఱకై
యొనఁగూడి యవి యడంచుట
యనుపమగతి సంఘధర్మ మనఁగాఁ బరగున్.

31

శత్రుమండలమును గుఱించిన వైశేషికవర్తనప్రకారము

క.

సహజుఁడు కార్యజుఁ డనగా
మహి నిరువురె శత్రు లరయ మానవపతికిన్
సహజుఁడు దాయాదుండౌ
నహితుఁడు కార్యజుఁడు వాని యన్యుం డెందున్.

32


గీ.

అరియెడఁ జరింపవలసిన యట్టి నడక
లయ్యె నాలుగు నుచ్ఛేద మపచయంబు
గాలమునఁ జేయు పీడన కర్శనంబు
లనుచు నయవిద్య లెఱుఁగువా రండ్రు ధరను.

33


వ.

అది యె ట్లనిన.

34