పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ప్రకృతుల నన్నింటిఁ బరిమార్చుట దలంప
            నదియుఁ దా నుచ్ఛేద మనఁగఁ బరగు
బలిమి భండారంబు గలిమి రిత్తఁగఁ జేయు
            నదియుఁ దా నపచయం బనఁగఁ బరగు
సరవి మహామాత్యసంహార మొనరింప
            నది కర్శనంబని యనఁగఁ బరగు
దుర్గరాష్ట్రాదులఁ దొడరి ఖండించుట
            యది పీడనం బని యనఁగఁ బరగు


గీ.

నిట్టి నాలుగు తెఱఁగులు నెఱిఁగి యరుల
యందుఁ గావింప నేర్చిన యట్టి ఘనుఁడు
సకలధాత్రీతలంబును బ్రకటలీల
నేలువై రుల నెల్ల జయించి మించు.

35


గీ.

ఆశ్రయవిహీనుఁడై యుండి యడరెనేని
హీనబలుఁ డగుపతి నాశ్రయించెనేని
యెందుఁ బలువురితో వైర మందెనేని
యపుడు భూపతి గడి శత్రు నడపవలయు.

36


ఉ.

ఎందు సమాశ్రయం బనుచు నెంతురు దుర్గము మిత్రు వీనితోఁ
జెంది మహాభిమానమును జెందిన శత్రుని వేళయందె వే
టందగఁ జేయఁగావలయు నాతనిఁగొల్చు నమాత్యుఁ జంపియుం
గ్రందగు రాష్ట్ర దుర్గముల రాయిడిచేఁ గడుఁ బీడ సేసియున్.

37


క.

తనమర్మము తన ఛిద్రము
దనవిక్రమ మెఱిఁగి చెఱుచుఁ దనవాఁ డగుచున్
దనరిన శత్రువు లోపల
మనికొందినయగ్ని యడ్డు మ్రాకులబోలెన్.

38