పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

అటులనే విజిగీషువై నట్టి భూపతి
          రసికుఁడై నీతిమార్గంబు మెఱసి
తనశత్రుమీఁదటఁ దనమిత్రభూపతి
          దనశత్రుమిత్రుపైఁ దనదుమిత్ర
మిత్రుఁడై నట్టి భూమీపతిఁ గవియింప
          నగు వారి కందఱ కవలనుండఁ
దనయరిమిత్రమిత్రుని గదలకయుండ
          నటఁ గృతకృత్యుఁడై యధికుఁడైన


గీ.

యుభయమిత్రుల రేఁచి పో రొదవఁ జేసి
తనకుఁ బిమ్మటఁ గల్గు శాత్రవులమీఁద
దండు గదలంగవలయు నుద్దండలీల
వినుతి కెక్కుచు జయముఁ జేకొనెడికొఱకు.

21


వ.

మఱియు నిట్టి విజిగీషువగు రాజు దనమిత్రులుం దాను నిద్ద
రిద్దరుఁ గూడి యెడనెడనయుండెడి తనశత్రువుల నిరుదిక్కు
లను జిక్కించక యుక్కడంచి జయించి మిందు తెఱంగు
వివరించెద.

22


సీ.

తానును నాక్రందధారుణీపతియుఁ బా
          ర్ష్ణిగ్రాహు నొవ్వఁగాఁ జేయవలయు
నాక్రందు నాక్రందనాసారు ననికంపి
          పార్ష్ణిగ్రహాసారుఁ బఱుపవలయుఁ
దనదుమిత్రుండును దానుఁ గూడుక తన
          యరిరాజుఁ బెకలించి చెఱుపవలయుఁ
దనమిత్రుచేతను దనమిత్రమిత్రుచేఁ
          దనయరిమిత్రునిఁ దఱుమవలయు