పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యల విజిగీషుమండలమున కైదేసి
           ప్రకృతులతో నెనుబదియు నవియు
రమణ నర్వదిమండలము లగు నవియును
           షష్టి పత్రమ్ములు షడ్గుణములు


గీ.

ననెడి విరులు నయానయయత్నయుగళి
నెపుడు నునికి క్షయస్థానవృద్ధు లనఁగ
నలరు త్రిఫలంబులును గల యట్టిమ్రాను
నెఱుఁగువాఁ డిట్టి నయగతి నెఱుఁగువాఁడు.

18


వ.

కావున నందు నీ చెప్పిన ద్వాదశరాజమండలంబుల యుద్ధ
క్రమంబుఁ గ్రమంబున వివరించెద.

19

మండలచరితప్రకరణము

సీ.

అలవిజిగీషువై నట్టి రాజునకును
            వెనుకఁ బార్ష్ణిగ్రాహుఁ డనెడి రాజు
నవలఁ బార్ష్ణిగ్రాహకాసారుఁడను రాజు
            శత్రువు లగుదు రీజగతిలోన
నాక్రందుఁడను రాజు నాక్రందకాసారుఁ
            డను రాజు మిత్రులై యొనరుచుండ్రు
కావున నచ్చోటఁ గలిగిన మిత్రభూ
            వరులచే శత్రుభూవరుల కెపుడు


గీ.

గదలఁగా రాక యుండఁ బో రొదవఁ జేసి
తనకు ముందరఁ గల్గు శాత్రవుల మీఁద
దండు గదలంగవలయు నుద్దండలీల
వినుతు కెక్కుచు జయముఁ జేకొనెడికొఱకు.

20