పుట:అహల్యాసంక్రందనము.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

అహల్యాసంక్రందనము

ఉ. ఏలనె జాలి సర్వజగదీశ్వరుడైన సురేశ్వరుండు ని
     న్నేలఁదలంచె మేలు గనవే వినవే యరచేతికబ్బు లి
     బ్బేలను బేలనుం బలె బలే పలుకందొరకొంటి వైన నీ
     కీలు నొకేం తెఱుంగుదు వకీలొనరింతు వికీల వేటికే?31
చ. చిలుకలకొల్కి, నీ సొగసు చిత్తరువందునఁ జూచి కన్నులన్
     [1]బలపల నీరునించి తల వంచి తలంచి భ్రమించి మించి హా
     వలపుల కేమి సేతు నని పౌర్థన చేయు నుమామహేశులన్
     బలరిపుఁ డమ్మహామహుని భావ మదేమి యెఱుంగఁబల్కవే.32
క. అనిన నహల్య యొకించుక
     నునుజెక్కుల నవ్వుదోఁప నూల్కొన నీకన్
     అనుఁ దా ననుతాపనతా
     ననతావనతాంగి యగుచు నవమధురోక్తిన్.33
సీ. 'స్వర్ణచిత్రవిచిత్రవర్ణమందిరములా
                    యీపర్ణసదనంబు లింద్రునకును
     సురసిద్ధసాధ్యభాసురదివ్యవీథులా
                    యీయాశ్రమంబు దేవేంద్రునకును
     వరకల్పనాకల్పకరకల్పతరువులా
                    యీవృక్షములు నందనేశునకును
     పటుదానసందానబహుమానగజములా
                    యీమృగావళులు మహేంద్రునకును
తే. రమ్యసౌందర్యవరకళా[2]ప్రౌఢిమలును
     గలిగి చెలఁగినయింద్రాణిఁ గాను నేను
     ప్రేమ నాపైని శక్రుఁ డేరీతిఁ బూనుఁ
     గ్రొత్తవలపులు వలవరే కుతలపతులు.34

  1. వలవల
  2. ప్రౌఢిమములు