పుట:అహల్యాసంక్రందనము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

65

సీ. రంభ కైవడిఁ గంబురాగుల్కుపల్కులో
                    తమిఁగూర్చువలపులో తారరీతి
     నూర్వశిచందాన నొరపొందుచిన్నెలో
                    రక్తిఁ గుల్కుటొ మదాలసవితాన
     శశిరేఖయందాన సకలకళాప్రౌఢొ
                    ఎదురొత్తులిచ్చుటో హేమలీల
     మంజుఘోషనిరూఢి మణితానుకూల్యంబొ
                    మానలీలలో ధాన్యమాలినివలె
తే. నెఱిఁ దిలోత్తమగతి నతిస్నేహగరిమ
     నెనయుటో సాగరికరీతి యింతలేని
     తపసియిల్లాండ్రపై బాళిఁ దగిలి మిగుల
     వగలఁ జెందుదురే తమవంటిదొరలు.35
క. సతికిన్ మును జేపట్టిన
     పతి నొక్కరుఁ దక్క నితరుఁ బాటించుట సం
     గతియటవే నీ కెంతటి
     మతిదిటవే యిట్లు నుడువ మర్యాదటవే!"36
ఉ. నావుడు యోగినీరమణి నవ్వుచు [1]నెచ్చెలి కొప్పు దువ్వుచున్
     “నావచనంబు వేదవచనంబని యెన్నుము బొంకెఱుంగనే
     నీవు జనించినప్పుడె సురేంద్రుఁడు నీదగుచెట్టఁబట్టినాఁ
     డీవిధి యౌను గాదనిన నీవె మునీంద్రునిచే నెఱుంగుమా!37
క. అది సూక్ష్మరూపమంటే
     నిది యాతనిస్థూలరూప మిదియదివేఱా!
     మదనాశుగసదనాయిత
     హృదనాగత ధైర్యవయ్యె దేలా బాలా!38

  1. నచ్చెలి