పుట:అహల్యాసంక్రందనము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'రమ్మనెరా తనదే నే
రమ్మనెరా వంచశరుని రాపోర్చుట భా
రమ్మనెరా నీవేతన
సొమ్మనెరా విజయరంగ చొక్కవజీరా!
'మాటికి మాబోటిని నొక
చోటికి రమ్మనుచు నెనయ జూచితి...'

ఇత్యాదులు చాలా లభిస్తూన్నవి. రసికుడైన కవి. ప్రభువు సముఖాన మెలగే సదస్యులకు రాజప్రీతికని కాని, స్వయముగానే కాని, ఆధోరణులు, ఆపోకడలు అలవాటు అయిపోవడంలో వింత ఏమీలేదు. వేంకటకృష్ణప్పనాయకుడు ఒకవంక ప్రభువుతో సమానంగా అన్నివిధాలభోగాలూ అనుభవించాడు, శేషము వేంకటపతి మొదలైన కవులను పోషించాడు, తాను కావ్యాలు రచించాడు. మరోవంక, యుద్ధాలలో గడిదేరి సంగరసవ్యసాచి అనే బిరుదందుకున్నాడు.[1] విజయ రాఘవరాయలను ససైన్యంగా రూపుమాపి, తంజావూరు రాజ్యాన్ని కూలద్రో

  1. వేంకటకృష్ణప్పనాయకునికి 'సంగరసవ్యసాచి' 'సంగరకిరీటి' అనేబిరుదము లుండేవని, వేటూరి ప్రభాకరశాస్త్రిగారు ప్రకటించిన 'తంజావూరు ఆంధ్రరాజులచరిత్రము' అనే ప్రాచీనవచనగ్రంథాన్నిబట్టి తెలుస్తున్నది. కానీ, శేషము వేంకటపతి వర్ణించినట్లుగా ఉన్న అహల్యాసంక్ర్రందనం అవతారిక పద్యాలలో ఎంతవరకు చూసినా, వేంకటకృష్ణప్పనాయకునికి, 'లీలామనోజాకృతీ!', 'కంతుజయంతరూప' 'కవికల్పక’ ‘భాషాఫణిగ్రామణీ' ఇలా సందర్భానికి సరిపోయే విశేషణగౌరవములే కనపడుతూన్నవి కాని, సంగరసవ్యసాచి, సంగరకిరీటి — వీటిప్రశంసే లేదు. 'రిపుజయాధార' 'శౌర్యసాంద్ర' యిలాగని పరాక్రమాన్ని కూడా అభినందించడం మరువనివాడు, ముఖ్యవిషయములను ఎందుకు వదలివేశాడో తెలియకుండా ఉన్నది. బహుశః అప్పటికింకా ఆబిరుదులు లభించి ఉండవనుకోవలెనా? కురుగంటి సీతారామయ్యగారు, తమ ఉపన్యాససంగ్రహములో, ఈమాట ఎత్తనేలేదు.